వయనాడ్ నుంచే ప్రియాంక పోటీ ఎందుకంటే?

75చూసినవారు
వయనాడ్ నుంచే ప్రియాంక పోటీ ఎందుకంటే?
కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకాగాంధీ పోటీచేయడం వెనుక హస్తం పార్టీ క్రేజీ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. వయనాడ్‌లో ప్రియాంక గెలుపు నల్లేరు నడకే. ప్రియాంక గెలుపుతో గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్‌లో సంఖ్య పెరగడంతో పాటు.. కాంగ్రెస్‌కు బలం పెరుగుతుంది. అంతేకాకుండా దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలవుతుందనే ఆలోచనతో ప్రియాంకను వయనాడ్ బరిలో నిలిపారని సమాచారం.

సంబంధిత పోస్ట్