బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసులో నిందితుడు అక్షయ్ షిండే.. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఘటనపై దర్యాప్తు న్యాయంగా, నిష్పక్షపాతంగా జరగాలని బాంబే హైకోర్టు పేర్కొంది. “నిందితుడిని మొదట చేతులు లేదా కాళ్లపై కాకుండా తలపై ఎందుకు కాల్చారు?" అని పోలీసులను ప్రశ్నించింది. "బలహీనమైన వ్యక్తి తుపాకీని లోడ్ చేయలేడు. ఎందుకంటే దానికి బలం అవసరం” అని తెలిపింది. కాగా అక్షయ్ తుపాకీ లాక్కొని కాల్పులు జరిపాడని అంతకుముందు పోలీసులు తెలిపారు.