అతి ఎప్పటికీ అనర్థమే. పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ మరీ ఎక్కువగా తింటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. అధికంగా పండ్లు తీసుకున్నప్పుడు అది కాలేయంపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కడుపు ఉబ్బరం, అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తవచ్చు. పండ్లలో ఉండే అధిక ఫైబర్, సహజ చక్కెరలు దంతక్షయానికి దారితీస్తాయి. దీనివల్ల మధుమేహ సమస్య కూడా రావచ్చు.