కోరమీసాల శ్రీకృష్ణుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

55చూసినవారు
కోరమీసాల శ్రీకృష్ణుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
సాధారణంగా వేణువు ధరించిన శ్రీకృష్ణుడ్ని మాత్రమే చూసి ఉంటారు. కానీ తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో శ్రీకృష్ణుడు కోరమీసాలతో దర్శనమిస్తున్నాడు. పూర్వకాలంలో రాజుల పాలన నుంచి విముక్తి పొందాలని చెల్లాపూర్ ప్రజలు ఓ ఆలయాన్ని నిర్మించారు. పక్కనే ఉన్న ఓ ఊరిలోని పాడుబడ్డ బావిలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని దొంగిలించి ఆలయంలో ప్రతిష్టించారు. ఆ విగ్రహాన్ని ఎవరు గుర్తుపట్టకుండా, విగ్రహానికి కోరమీసాలు అలంకరించారు. అప్పటి నుంచి కృష్ణుడ్ని కోరమీసాల కృష్ణయ్యగా పిలుస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్