సూసైడ్‌కు ముందు ఎమ్మెల్యేకు భార్య వీడియో కాల్

69చూసినవారు
తెలంగాణలోని చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మృతి చెందారు. ఆత్మహత్య చేసుకునే ముందు రూపాదేవి భర్తకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం అల్వాల్ నుంచి ఎమ్మెల్యే చొప్పదండికి వెళ్లారు. సాయంత్రం ఆయనకు రూపాదేవి వీడియో కాల్ చేసి చనిపోతున్నానని చెప్పారు. ఎమ్మెల్యే ఇంటికి చేరుకునేలోపే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి సత్యం స్పృహ తప్పి పడిపోయారు. కాగా ప్రేమ వివాహం చేసుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్