నల్గొండ జిల్లాలో అదనంగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో అన్నారు. సభలో శనివారం రైతు భరోసాపై చర్చ సందర్బంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇవ్వలేదన్నారు. తాను లాగ్ బుక్స్ తీసుకువచ్చి చూపిస్తానని అన్నారు. ఉచిత కరెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు.