రేవంత్ బృందం భారీ పెట్టుబడులు తెస్తుందా?

71చూసినవారు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చంద్ర‌బాబు, రేవంత్‌రెడ్డి తమ రాష్ట్రాలకు పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక స‌ద‌స్సుకు తమ టీంలతో అక్కడకు చేరుకున్నారు. ప్రధానంగా ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీమ్ చర్చలు జరపనుంది. గ‌తేడాది దావోస్ పర్యటనలో తెలంగాణ‌కు రూ. 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణ‌కు ఈసారి భారీ పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్