సెక్షన్ 80C పరిమితి ఈసారైనా పెరిగేనా?

73చూసినవారు
సెక్షన్ 80C పరిమితి ఈసారైనా పెరిగేనా?
బడ్జెట్‌ వచ్చిన ప్రతిసారీ వేతన జీవులు ఆశగా ఎదురుచూసే వాటిలో శ్లాబుల సవరణ ఒకటైతే.. సెక్షన్‌ 80C రెండోది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. గృహ రుణాలు, జీవిత బీమా, పీపీఎఫ్, ఈపీఎఫ్ వంటి పెట్టుబడులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. చివరిగా 2014లో ఈ పరిమితిని పెంచారు. కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సారైనా 80C పరిమితి పెంచుతారా? అని మధ్యతరగతి ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్