చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, అగ్నిమాపకశాఖ సేవలకు సంబంధించిన ఎన్‌వోసీ జారీ తదితర లక్ష్యాలతో 2024 జులై 19న తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఔటర్ రింగు రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలోకి చేర్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక కూల్చివేతలు చేపట్టగా.. తాజా ఆర్డినెన్స్‌తో మరిన్ని అధికారాలు హైడ్రాకు వచ్చాయి.