మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. అకస్మాత్తుగా ఓ చెట్టు విరిగి పడింది. నేరుగా అది ఓ మహిళపై పడింది. దీంతో ఆమె సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఓ చిన్నారి, యువకుడు కూడా గాయపడ్డారు. అంతేకాకుండా చెట్టుకింద పార్క్ చేసిన కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన తరువాత, టీ స్టాల్‌లో పనిచేసే అజయ్ స్పందించి, బాధితులను రక్షించారు. ఆయనకు కూడా గాయాలయ్యాయి.