భారీ అలల తాకిడికి కొట్టుకుపోయిన మహిళ(వీడియో)

84చూసినవారు
రష్యాలోని సోచిలో ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. బీచ్ లో సరదాగా గడిపేందుకు వచ్చిన ఓ జంటకు విషాదం మిగిలింది. జూన్ 16న 20 ఏళ్ల యువతి తన ప్రియుడితో కలిసి బీచ్‌లో షికారుకు వచ్చింది. వైరల్ అవుతున్న వీడియోలో ఆ జంట ఆనందంగా గడపడం కనిపిస్తోంది. ఈ క్రమంలో భారీ అలలు వారిని చుట్టుముట్టాయి. అలల దాటికి ఆ యువతి కొట్టుకుపోయింది. దీంతో తన ప్రియురాలి కోసం ఆమె ప్రియుడు సముద్రంలో ఎగిసే కేరటాలకు ఎదురెళ్ళి వెతకడం హృదయాలను కలచివేస్తోంది.

సంబంధిత పోస్ట్