టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలిసారి జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో లావు పేరును ఈ మేరకు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాష్ట్రానికి తీసుకురావాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.