ప్రధాని కీలక నిర్ణయం.. నలుగురు పిల్లలుంటే జీవితాంతం నో ట్యాక్స్

58చూసినవారు
ప్రధాని కీలక నిర్ణయం.. నలుగురు పిల్లలుంటే జీవితాంతం నో ట్యాక్స్
ఆర్థిక మరియు వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా, హంగేరియన్ యువత వివాహం పట్ల ఆసక్తి చూపడం లేదు. జననాల రేటు తగ్గడంతో ఆ దేశ ప్రధాని విక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలకు జన్మనిచ్చిన మహిళలకు జీవితాంతం పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. 41ఏళ్లలోపే పెళ్లి చేసుకుంటే ₹22 లక్షల సబ్సిడీ రుణాలను 2019 నుంచి ఇస్తున్నారు. ఇద్దరికి జన్మనిస్తే మూడోవంతు, ఆపైన పిల్లలను కంటే మొత్తం రుణాన్ని మాఫీ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్