తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేస్తాం, ఖతం చేస్తాం.. ఇవన్నీ కాదు బొంద తీసి పాతరేస్తామని గతంలో కేసీఆర్ అన్నారు. కట్ చేస్తే ఆ సీన్ ఇప్పుడు రివర్సైనట్టుంది. ఇప్పటికే టైర్లు పంక్చర్ అయి.. ఇంజన్ బోర్‌కు వచ్చిన కారు పార్టీ షెడ్డుకు చేరింది. మిగిలిన నేతలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్‌లో అత్యంత కీలకమైన నేత, మాజీ స్పీకర్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు.