గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి
ఉపాసన కొణిదెల అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేస్తున్న వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్
ఇండియా విభాగానికి ఆమె నేషనల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్
ఇండియా, అపోలో హాస్పిటల్ ట్రస్ట్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. నాలుగేళ్ల పాటు
ఉపాసన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.