మొసళ్లను సైతం వేటాడే చేపలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ వీడియో చూస్తే కచ్చితంగా ముక్కున వేలేసుకుంటారు. అంత ప్రమాదకరంగా ఉంటాయి ఈ చేపలు. కత్తుల వంటి పదునైన దంతాలతో ఉండే ఈ చేపను టైగర్ ఫిష్ అంటారు. ఆఫ్రికాలోని నదులు, సరస్సుల్లో కనిపించే టైగర్ ఫిష్ ఒక భయంకరమైన ప్రెడేటర్. ఇది దాని పెద్ద, బాకు లాంటి దంతాలతో ఎరలను చాలా దారుణంగా వేటాడుతుంది. అంతేకాదు, అది కేవలం అర నిమిషంలో మొసలి ఎముకలను కరకర నమిలేయగలదు.