పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ఇటీవల అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు వీధి కుక్కపై క్రూరత్వానికి పాల్పడ్డాడు. పలుమార్లు కుక్కను డ్రెయినేజీలో పడేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. సిలిగురిలోని దుర్గా నగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నిందితుడు ఉద్దేశపూర్వకంగా, సరదా కోసం కుక్కపై పైశాచికత్వానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతరం అతడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు.