యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సమయపాలన పాటించని సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేషంట్స్ దగ్గరకు వెళ్ళి వైద్యం ఎలా చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటెండన్స్ రిజిస్టర్ ని పరిశీలించారు. సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న రాథోడ్ కి షోకాస్ నోటీస్ జారీ చేశారు.