యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో చలి తీవ్రతలు గణనీయంగా పెరిగాయి. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో చలితీవ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దట్టమైన పొగ మంచుతో చలి గాలులు వీస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు చలిపట్ల ప్రమాదంగా ఉండాలని సూచిస్తున్నారు. చలి నుండి రక్షించుకునేందుకు చలిమంటలు వేసుకుంటున్నారు.