తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీలో భాగంగా. రూ. లక్ష మాఫీకి చర్యలు తీసుకోవడంపై గురువారం తుర్కపల్లి మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. గత భారాస ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి. మొదటి విడతగా రూ. లక్షలోపు రుణమాఫీకి శ్రీకారం చుట్టారని హర్షం వ్యక్తం చేశారు.