మంచినీటి సహాయకుల శిక్షణ తరగతులు

50చూసినవారు
మంచినీటి సహాయకుల శిక్షణ తరగతులు
బొమ్మలరామారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ శాఖ జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని 34 గ్రామపంచాయతీల వాటర్ మెన్ లకు స్వచ్ఛమైన మంచినీటి సరఫరా, పైపులైన్ల మరమ్మత్తు, కొత్త పైపులైన్ల నిర్మాణం, మోటారు రిపేరింగ్ మొదలైన అంశాలపై 4 రోజులు శిక్షణ అందించి వారికి మంచినీటి సహాయకులుగా ధృవపాత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎంపీడీవో, పర్యవేక్షకులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్