యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం స్వామివారికి అష్టోత్తర శతకటాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండ చుట్టూ గిరిప్రక్షిన కార్యక్రమంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని స్వామివారి పాదాల చెంత దీపం వెలిగించి కార్యక్రమాన్ని ఆలేరు ఏం. ఎల్. ఏ ఐలయ్య, పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.