యాదాద్రి జిల్లాలో తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం కార్తీకమాసం కావడంతో స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. యాదాద్రలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది. స్వామివారిని దర్శించుకొని భక్తులు సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.