తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని గౌహతి హై కోర్టు జడ్జి జస్టిస్ మిథాలి ఠాకూరియా కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు వారు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆలయ ఈ. ఓ భాస్కర రావు వారికి ప్రత్యేక దర్శనం, ఆశీర్వచనము ఏర్పాట్లు చేసి అనంతరము స్వామి వారి లడ్డు ప్రసాదం, స్వామి వారి ఫోటో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.