పార్లమెంట్ లో అమిత్ షా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై అమర్యాదగా మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా ఇండియా కూటమి చేపట్టిన నిరసన ర్యాలీలో ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారితో కలిసి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మనువాద అరాచకం సృష్టిస్తుందని వారు ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి ఎంపీలు పాల్గొని నిరసన తెలియజేశారు.