తెలంగాణలో ఈరోజు నుండి మద్యం దుకాణాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీ నగర్ మండల కేంద్రంలోని మద్యం దుకాణాల ముందు ఉదయం 8 గంటల నుండి ప్రజలు బారులు తీశారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వైన్స్ సిబ్బందికి సహకరిస్తున్నారు. మద్యం దుకాణం యజమానులు మనిషికి మనిషికి ఒక మీటర్ మధ్యలో బాక్సులు పోసి ప్రజలను అందులో నిలబడమని సూచిస్తున్నారు.