యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలాన్ని విభజించి నూతన మండలంగా మత్స్యాద్రి వేములకొండ గ్రామాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ 13వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. 13 రోజులుగా నిరసన చేపడుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం శోచనీయం అని, ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే వలిగొండ తహశీల్దార్ కార్యాలయం ముట్టడి చలో కలెక్టరేట్ కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఇట్టి నిరసన కార్యక్రమాలలో పాల్గొన్న వారు సామ రాంరెడ్డి, ఆకుల వెంకన్న, కొత్త రామచెందర్, కేసిరెడ్డి జనార్ధన్ రెడ్డి, గడ్డం భిక్షపతి, ఎలాగందుల రవీందర్, తోట నాగయ్య, ఎలాగందుల మార్కండేయ, కడిగాళ్ల చెమ్మయ, యువకులు, విద్యార్థులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.