AP: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఉద్యోగులకు నైట్ షిఫ్టు అలవెన్స్ ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై రాత్రి వేళల్లో విధులకు హాజరయ్యే ఉద్యోగులకు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ లభించనుంది. దీంతో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విజయవాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే వారికి సుమారు నెలకు రూ. 4వేలు అదనంగా లభించనున్నాయి.