ఇందిరా గాంధీ చేత జేఎన్‌యూ ఛాన్స్‌లర్‌ పదవికి రాజీనామా చేయించిన ఏచూరి!

85చూసినవారు
ఇందిరా గాంధీ చేత జేఎన్‌యూ ఛాన్స్‌లర్‌ పదవికి రాజీనామా చేయించిన ఏచూరి!
దేశ రాజకీయాల్లో ఐరన్‌ లేడీగా పేరున్న ఇందిర పక్కన నిల్చుని ఆమెను JNU ఛాన్స్‌లర్‌ పదవికి రాజీనామా చేయాలని సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. ఎమర్జెన్సీ తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాని పదవి కోల్పోయిన ఇందిర.. జేఎన్‌యూ ఛాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో 1977 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏచూరి నేతృత్వంలోని విద్యార్థులు నేరుగా ఆమె నివాసం వద్దకు చేరి డిమాండ్‌ చేయడంతో కొన్నాళ్ల తర్వాత ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్