ముంబైలోని రోడ్డు పక్కనున్న ఓ పుడ్ స్టాల్‌లో దారుణం జరిగింది. సూరజ్ నారాయణ్ యాదవ్(19) అనే యువకుడు గ్రైండర్‌లోని పదార్ధాలను తీయడానికి అందులో చేయి పెట్టాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా అతని చేయి గ్రైండర్‌లో ఇరుక్కుపోయింది. అనంతరం అతను చేయి బయటకి లాక్కునే ప్రయత్నంలో యంత్రంలో పడిపోయాడు. ఈ ఘటనలో యువకుడు మృతి చెందాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.