ఉడకబెట్టిన నల్ల శనగల్లో అనేక పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. ఇది జీర్ణక్రియను పెంచుతుంది. శనగలలో గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కనుక షుగర్ ఉన్నవారికి ఇవి చక్కని ఆహారం అని చెప్పవచ్చు. వీటిని తింటే షుగర్ లెవల్స్ పెరగవు సరికదా, వీటిల్లో ఉండే ఫైబర్ షుగర్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తుంది. కనుక రోజువారి ఆహారంలో చేర్చుకోవచ్చు.