ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గల సహస్త్రధార పర్యాటక ప్రాంతానికి తరుచూ ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ క్రమంలోనే కొంతమంది యువతి, యువకులు కూడా వెళ్లారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ముగ్గురు యువకులు, ఇద్దరు యువతుల మధ్య ఘర్షణ జరిగి చిత్తు చిత్తు కొట్టుకున్నారు. కాళ్లతో తన్నుకున్నారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో పోలీసుల కంట్లో పడింది. వారు వీడియోలో ఉన్న బైక్ నెంబర్ల ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.