భారతదేశ రాచరికానికి సంబంధించిన అరుదైన ‘గోల్కొండ బ్లూ’ వజ్రం జెనీవాలో మే 14న జరిగే క్రిస్టీస్ 'మగ్నిఫిసెంట్ జ్యువెలర్స్' వేలంలో అమ్మకానికి సిద్దమైంది. ఈ వజ్రం 23.24 క్యారెట్ల బరువు కలిగి ఉంటుందట. ఇది ప్రస్తుతం ప్రఖ్యాత పారిసియన్ ఆభరణాల వ్యాపారి జార్ అనే వ్యక్తి దగ్గర ఉంది. దీని ధర 35 నుంచి 50 మిలియన్ డాలర్లు పలుకుతుందట. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.300 నుంచి రూ.430 కోట్ల వరకు ఉంటుంది. ఈ వజ్రాన్ని అత్యంత అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా పిలుస్తారట.