AP: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బొమ్మనహళ్ మండలం కళ్లుహోళలో టీడీపీ నేత సోమన్నగౌడ్ పై హత్యాయత్నం జరిగింది. సోమన్నపై గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేశారు. దీంతో సోమన్నగౌడ్ వీపు, భూజంపై తీవ్రగాయాలు కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి బొమ్మనహళ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.