భారత్ ప్రగతిశీల రక్షణ సాంకేతికతలో కీలక విజయాన్ని సాధించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 30 కిలోవాట్ల శక్తిగల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థతో ఫిక్స్డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్, క్షిపణులు, స్వార్మ్ డ్రోన్లను విజయవంతంగా ఛేదించగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ ప్రదర్శనతో, అమెరికా, చైనా, రష్యాల తరువాత, లేజర్ బీమ్ సాయంతో ఫిక్స్డ్ వింగ్ డ్రోన్‌ను ఛేదించే సాంకేతికతను కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.