బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(BITS) విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష BITSAT-2025. దీనిని ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తుంది. BITSAT అర్హత కలిగిన అభ్యర్థులకు BITS మూడు క్యాంపస్‌లలో ప్రవేశం కల్పిస్తారు. ప్రతీ ఏటా సుమారు 2 లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతారు. దాదాపు 2,000 సీట్లు అందుబాటులో ఉంటాయి. వీరికి BITS పిలానీ, BITS గోవా, BITS హైదరాబాద్ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.