ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓయువతి గన్ చేతిలో పట్టుకుని పాట పాడుతూ రీల్స్ చేస్తోంది. ఈ రీల్ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సదరు యువతి కూల్ మూడ్‌లో సినిమా పాటలో రీల్స్ చేస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు యువతి కోసం వెతుకుతున్నారు. ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.