యూట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై యూట్యూబర్ హర్షసాయి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయొద్దని.. బెట్టింగ్ మూలాలపై పోరాడదామంటూ పోస్టు చేశారు. మళ్లీ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయనని హర్ష ప్రకటించారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్‌పై హర్షసాయిపై కేసు నమోదు అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడంతో వైరల్ అవుతున్నాయి.