DRDO అభివృద్ధి చేస్తున్న ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అస్త్ర MK3 పేరును గాండీవంగా మార్చారు. గాండీవం అర్జునుడి ధనస్సు పేరు. అస్త్ర MK3 అనేది అస్త్ర MK1, అస్త్ర MK2 క్షిపణుల తర్వాత భారత డైనమిక్స్ లిమిటెడ్‌తో కలిసి DRDO అభివృద్ధి చేస్తోంది. ఇది వాతావరణంలో ఉండే ఆక్సిజన్‌ను ఆక్సీకరణ కారణంగా ఉపయోగించే అత్యాధునిక సాంకేతిక సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది.