యువరాజ్ సింగ్ నా ఆరాధ్య దైవం: అభిషేక్

50చూసినవారు
యువరాజ్ సింగ్ నా ఆరాధ్య దైవం: అభిషేక్
భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ తన ఆరాధ్య క్రికెటర్ ఎవరో చెప్పాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ల్లో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగే తన ఆరాధ్య దైవమని తెలిపాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువీ కొట్టిన 6 బంతుల్లో 6 సిక్స్‌లను చూసి తాను క్రికెటర్ కావాలని నిర్ణయించుకున్నానని గుర్తు చేసుకున్నాడు. తన అభిమాన ఆటగాడి మార్గదర్శకంలోనే తాను ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదగడం సంతోషంగా ఉందన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్