యువ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘జీబ్రా’. లక్ ఫేవర్స్ ది బ్రేవ్.. అన్నది ఉపశీర్షిక. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అక్టోబర్ 31న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ను విడుదల చేసింది.