బెంగాల్ గవర్నర్‌ సీవీ ఆనంద్ బోస్పై జీరో FIR నమోదు

75చూసినవారు
బెంగాల్ గవర్నర్‌ సీవీ ఆనంద్ బోస్పై జీరో FIR నమోదు
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై డ్యాన్సర్ లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 376, 120బి కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో సీవీ ఆనంద్ బోస్ మేనల్లుడి పేరు కూడా ఉంది. ఈ ఎఫ్‌ఐఆర్ హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో నమోదు అయింది. అయితే జీరో ఎఫ్ఐఆర్ నమోదైతే కేసు నమోదు చేసే పోలీసులు ఎక్కడైనా ఘటనపై దర్యాప్తు చేసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్