రూ.100కి చేరువలో టమాటా

50చూసినవారు
రూ.100కి చేరువలో టమాటా
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టమాటా దిగుబడులు భారీగా తగ్గాయి. దీంతో ధరలు భగ్గుమంటున్నాయి. తీవ్రమైన వేడిగాలుల కారణంగా గడిచిన 20 రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో టమాటా ధరలు రెండింతలు పెరిగాయి. దీంతో కిలోకు రూ.70 నుంచి రూ.90 వరకు పలుకుతున్నాయి. ఇక ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే రూ.100కి చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్