జొమాటో కీలక ప్రకటన

72చూసినవారు
జొమాటో కీలక ప్రకటన
శాకాహారం మాత్రమే కోరుకునే వారికోసం ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన కొన్ని గంటల్లోనే జొమాటో మరో కీలక ప్రకటన చేసింది. ఈ కొత్త సేవలను అందించే తమ డెలివరీ బాయ్స్‌ గ్రీన్‌ రంగు యూనిఫామ్‌ ధరిస్తారని తెలిపిన కంపెనీ తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్‌లోనే కనిపిస్తారని తెలిపింది. అలా అని ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ సేవలను నిలిపివేయడం లేదని స్పష్టం చేసింది. వెజ్‌ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్