త్వరలో వాట్సప్‌ స్టేటస్‌లో నిమిషం వీడియో

64చూసినవారు
త్వరలో వాట్సప్‌ స్టేటస్‌లో నిమిషం వీడియో
వాట్సప్‌ స్టేటస్‌లో ప్రస్తుతం గరిష్ఠంగా 30 సెకన్ల నిడివి గల వీడియోలను మాత్రమే పోస్ట్‌ చేసేందుకు అవకాశం ఉంది. అంతకంటే పెద్ద వీడియోలను అప్‌లోడ్‌ చేయాలంటే మరో స్టేటస్ అప్‌డేట్‌ తప్పదు. అలా వీడియో నిడివి పెరుగుతున్న కొద్దీ స్టేటస్‌ అప్‌డేట్ల సంఖ్య పెరుగుతూ పోతుంది. దీన్ని పరిష్కరించేందుకు వాట్సప్‌ సిద్ధమైంది. ఇకపై 60 సెకన్ల నిడివితో ఉన్న వీడియోలను సైతం స్టేటస్‌లో అప్‌లోడ్‌ చేసే అవకాశాన్ని వాట్సప్‌ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్