'కంగువా' అంటే అర్థం ఇదే!
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు శివ కాంబోలో తెరకెక్కిన 'కంగువా' సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే 'కంగువా' అనేది తమిళ పదం. తెలుగులో దాని అర్థం తెలుసుకోవడానికి నెటిజన్లు 'గూగుల్'లో తెగ సెర్చ్ చేస్తున్నారు. కంగువా అంటే తెలుగులో అగ్నిలాంటి కాంక్షతో రగిలేవాడు, అనుకున్నది సాధించేవాడు అనే అర్థాలు ఉన్నాయి.