'పుష్ప-2' మూవీ మేకర్స్ మాస్టర్ ప్లాన్
మైత్రీ మూవీ మేకర్స్ 'పుష్ప-2' విషయంలో వినూత్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రతీ థియేటర్లో తొలి రోజు తొలి టికెట్ వేలం పద్ధతి ద్వారా అమ్మాలని భావిస్తున్నారట. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో మొదటి టికెట్ వేలం ద్వారానే విక్రయిస్తారని ప్రచారం జరుగుతోంది. పుష్ప-2 క్రేజ్ చూస్తుంటే వేలం ఐడియా కూడా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే జరిగితే తొలిరోజు వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.