యూకేలో డాల్బీ అట్మాస్లో ప్రదర్శించనున్న తొలి తెలుగు చిత్రం 'దేవర'
ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ‘దేవర’ మరో రికార్డు నెలకొల్పింది. యూకేలో డాల్బీ అట్మాస్లో ప్రదర్శించనున్న తొలి తెలుగు చిత్రంగా నిలవనుంది. ఈనెల 26న ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఆనందం వ్యక్తంచేసింది. ఇప్పటికే విడుదలైన ‘చుట్టమల్లే’, ‘దావూదీ’ పాటలు యూట్యూబ్లో ట్రెండింగ్ జాబితాలో నిలిచాయి. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.