కాసేపట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్ భేటీ
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ఇరుపార్టీలతో కూడిన సమన్వయ కమిటీ భేటీ కానుంది. టీడీపీ యువనేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీలో పాల్గొననున్నారు. వీరితో పాటు ఇరు పార్టీల నుంచి 6 మంది చొప్పున కీలక నేతలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రిలోని మంజీరా హోటల్ లో ఈ సమావేశం జరగనుంది.