జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు ఫిల్టర్ లేదని, ఏది అనుకుంటే అది చేసేస్తారని వ్యాఖ్యానించారు. ఎక్కడ మంచి, నిజాయితీ, న్యాయం ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ నిలబడతారని అన్నారు. పవన్ కళ్యాణ్‌తో హైజానర్ సినిమా తీయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పొలిటికల్ పరంగా బిజీగా ఉన్నారన్నారు.